నల్గొండ పట్టణం రామగిరిలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం రాష్ట్రంలో రెండవ భద్రాద్రిగా పేరుగాంచింది. దాదాపు 300 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించారు. మొదట ఈ దేవాలయం పట్టణంలోని మాల్బౌళి సమీపంలో ఉండేది. కొంతకాలం అనంతరం ఈ ప్రాంతంలో అనాచారాలు, దుష్కర్మలు జరగడంతో శ్రీ స్వామి వారు శ్రీ కంభంమెట్టు శేషాచార్యుల అన్నదమ్ములకు కలలో కనిపించి నన్ను వేరే ఎక్కడైనా ప్రతిష్టించాలని కోరుకున్నారనే ప్రచారం ఉంది. దీంతో ఒక మంచి ముహుర్తం చూసుకుని నల్గొండ సమీపంలోని పానగల్లు గ్రామానికి వెళుతుండగా మార్గమధ్యలో గరుడ పక్షి వచ్చి శకునంగా వాలి భూమికి ముక్కు తుడిచి వెళ్లిందని, అప్పుడు వారు ఈ పక్షి దష్టాంతరం తెలుసుకునేందుకు కొందరు వ్యక్తులను తీసుకెళ్లి గడ్డపారలతో తవ్వగా ఆ ప్రదేశంలో ప్రస్తుతం ఉన్న దేవాలయానికి కావాల్సిన రాయి, తదితర వస్తువులు దొరకడంతో సుమారు 200 సంవత్సరాల క్రితం దేవాలయం నిర్మించారు. ఈ దేవాలయంలో శ్రీ సీతారామ, లక్ష్మణ, భరత, శతృఘ్న, హన్మంత సమేతంగా ప్రతిష్టంచడంతో ఈ ప్రాంతానికి రామగిరి అనే నామకరణం చేశారు.
మొదట్లో ఈ దేవాలయంలో గర్భగుడి మాత్రమే ఉండగా ప్రస్తుతం ఆండాళ్ దేవత, సీతారాముల విగ్రహాలు, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయస్వామి విగ్రహాలు, రాజగోపురం, కళ్యాణమండపాలతో యజ్ఞశాతలతో దేవాలయం ప్రస్తుతం నిత్య పూజలతో భక్తుల మధ్య విరాజిల్లుతున్నది. 1956 పూర్వం దేవాలయం అసంపూర్తిగా ఉండడంతో ఆనాటి డిప్యూటి కలెక్టర్ కన్నయ్య భార్య శ్రీమతి రిందాదేవి నిర్మాణం చేయించారు. రిందాదేవికి అండాళమ్మ కలలో ప్రత్యక్షమై దేవాలయం నిర్మించమని కోరగా అండాళమ్మ దేవి విగ్రహాన్ని ప్రతిష్టంచారు. ఈ ఆలయం గురించి అనేక కథలు ప్రచారంలో ఉండగా మొదట ఈ దేవాలయంలో కంభమెట్లు అనంతాచార్యులు, శేషాచార్యులు గర్భగుడిని నిర్మించినట్లు పూర్వికులు చెబుతున్నారు.
1957 వరకు ఈ దేవాలయంలో పూజారులు వీరి వంశస్తులు పూజలు నిర్వహించారు. అనంతాచార్యులు, శేషాచార్యులలో ఒకరు వైద్య వృత్తిలో ప్రవీణులు. వీరు వైద్యంతో హైదరాబాద్ నవాబ్ భార్య వ్యాధిని నయం చేయగా అందుకు నవాబు కొంత భూమిని ఆలయ నిర్మాణానికి ఇచ్చినట్ట పట్టణ ప్రజలు చెప్పుకుంటుంటారు. ఈ దేవాలయంలో శేషాచార్యులు సుమారు నలభై సంవత్సరాలు ప్రధాన పూజారులుగా పనిచేశారు. దేవాలయం చైర్మన్గా బుర్రి శ్రీనివాస్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టి ఆలయానికి మెరుగులు దిద్దారు. ముఖ్యంగా శ్రీరామనవమి పండగ సందర్భంగా కళ్యాణ మహోత్సవాలు వేలాది మంది భక్తుల మధ్య ఘనంగా జరుపుతారు. శ్రీరామనవమి పండగ సందర్భంగా జిల్లా ప్రజలే కాకుండా మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు.
అంతేకాకుండా దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది తదితర ముఖ్యమైన పండగల్లో సంబరాలను వైభవంగా జరుపుకుంటారు. సంక్రాంతి సమయంలో ధునుర్మాసోత్సవాలు నెల రోజులపాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ధనుర్మాసోత్సవం సందర్భంగా ఆలయంలో మహిళలకు ముగ్గుల పోటీలు తదితర పోటీలను నిర్వహించి వారికి ఆలయ ఛైర్మన్ బహుమతులు అంద చేస్తారు. ఉగాది పండగ సందర్భంగా ఎనిమిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలకు ప్రత్యేకంగా రథాన్ని పట్టణ పురవీధుల గుండా ఊరేగిస్తారు. ప్రతి శ్రావణమాసంలో వచ్చే అండాలు తిరునక్షత్రం రోజున అమ్మవారి జన్మదినం ఘనంగా జరుపుతారు.

No comments:
Post a Comment